News November 26, 2024

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.

Similar News

News December 11, 2024

రూ.1,000 కోట్లు దాటేసిన ‘పుష్ప-2’

image

బాక్సాఫీసుపై అల్లు అర్జున్ ‘పుష్ప-2’ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్రను లిఖించిందని పేర్కొంది. దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారని పేర్కొంది.

News December 11, 2024

కన్నీటితో విద్యుత్ తయారు చేసేలా..!

image

కన్నీళ్ల నుంచి విద్యుత్ తయారుచేసే యోచనలో సైంటిస్టులున్నట్లు తెలుస్తోంది. మానవ కన్నీళ్లలో నాక్రే అనే మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉన్నట్లు వారు గుర్తించారు. ఇవి ఒత్తిడికి గురైనప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని పరిశోధనలో తేలినట్లు తెలుస్తోంది. ఇది కన్నీళ్ల నుంచి బయోఎలక్ట్రిక్ ఎనర్జీని ఉపయోగించడంపై ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో దీనిపై మరింత పరిశోధన చేసే అవకాశం ఉంది.

News December 11, 2024

BREAKING: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.