News November 26, 2024
IPL: పృథ్వీ షాను అందుకే తీసుకోలేదా?
ముంబై బ్యాటర్ పృథ్వీ షా IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఫామ్ లేమి, అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు ఇందుకు కారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ గాయాలబారిన పడుతున్న అతడు సీజన్ మొత్తం ఆడగలడనే నమ్మకం ఫ్రాంచైజీల్లో కలగలేదని అంటున్నాయి. IPLలో DC తరఫున 2018లో అరంగేట్రం చేసిన షా ఆ సీజన్‌లో 153 స్ట్రైక్ రేటుతో రాణించారు. ఆ తర్వాతి సీజన్లలో అతడి SR 134, 137కి తగ్గింది.
Similar News
News November 26, 2024
ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిల్ కొట్టేసిన సుప్రీం
ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని, బ్యాలెట్ విధానం మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలో బలమైన కారణం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.
News November 26, 2024
రాహుల్ పౌరసత్వం రద్దు ఫిర్యాదులపై చర్యలు ప్రారంభించాం: కేంద్రం
రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు సంబంధించి హోం శాఖకు ఫిర్యాదులు అందాయని అలహాబాద్ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ విషయమై చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించింది. రాహుల్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఉందని, ఆయన భారత పౌరసత్వం రద్దుకు CBI దర్యాప్తు కోరుతూ కర్ణాటక BJP నేత విఘ్నేశ్ కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 19న జరిగే తదుపరి విచారణలో ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది.
News November 26, 2024
కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ
TG: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.