News November 26, 2024

IPL: పృథ్వీ షాను అందుకే తీసుకోలేదా?

image

ముంబై బ్యాటర్ పృథ్వీ షా IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఫామ్ లేమి, అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు ఇందుకు కారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ గాయాలబారిన పడుతున్న అతడు సీజన్ మొత్తం ఆడగలడనే నమ్మకం ఫ్రాంచైజీల్లో కలగలేదని అంటున్నాయి. IPLలో DC తరఫున 2018లో అరంగేట్రం చేసిన షా ఆ సీజన్‌లో 153 స్ట్రైక్ రేటుతో రాణించారు. ఆ తర్వాతి సీజన్లలో అతడి SR 134, 137కి తగ్గింది.

Similar News

News July 8, 2025

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

image

ఇంగ్లండ్‌ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

News July 8, 2025

ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.

News July 8, 2025

పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

image

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.