News November 26, 2024
చైనాలో ‘మహారాజ’కు టాప్ రేటింగ్
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ చైనాలో ఈ నెల 29న 40వేల థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అక్కడ ప్రివ్యూలు చూసిన విశ్లేషకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ మూవీ రివ్యూ సైట్ Douban 8.7/10 రేటింగ్ ఇచ్చింది. ఇటీవలకాలంలో ఓ భారత చిత్రానికి ఇచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే. కాగా ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చైనాలో సంచలన విజయాలు సాధించాయి.
Similar News
News November 26, 2024
మీకు PAN కార్డు ఉందా..? అయితే ఇది తెలుసుకోండి
PAN 2.0 త్వరలో ప్రారంభం అవుతుండడంతో ప్రస్తుతం పాన్ కార్డు ఉన్న వారు పాత కార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదని CBDT ప్రకటించింది. ఒకవేళ పాన్ కార్డులోని వివరాలను మార్చుకోవాలనుకుంటే PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభమయ్యాక ఉచితంగా మార్చుకోవచ్చని తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా PAN/TAN సేవలు అప్‌గ్రేడెడ్ డిజిటలైజేషన్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఒకే పోర్టల్‌లో అందుబాటులోకొస్తాయి.
News November 26, 2024
రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్
AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
News November 26, 2024
బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించండి: సీఎం
HYD లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. ‘గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోటును ప్రపంచస్థాయిలో తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇక్కడ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, శాంతి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాలను బదిలీ చేయండి’ అని CM కోరారు.