News November 26, 2024
చైనాలో ‘మహారాజ’కు టాప్ రేటింగ్

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ చైనాలో ఈ నెల 29న 40వేల థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అక్కడ ప్రివ్యూలు చూసిన విశ్లేషకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ మూవీ రివ్యూ సైట్ Douban 8.7/10 రేటింగ్ ఇచ్చింది. ఇటీవలకాలంలో ఓ భారత చిత్రానికి ఇచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే. కాగా ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చైనాలో సంచలన విజయాలు సాధించాయి.
Similar News
News November 13, 2025
నేడు దానధర్మాలు చేస్తే..?

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.
News November 13, 2025
‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.


