News November 26, 2024

IPL ఎలా, ఎందుకు మొదలైందో తెలుసా?

image

2007 T20 WCలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రేజ్ చూసి ఇండియాలోనూ T20 టోర్నీ నిర్వహించాలని అప్పటి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ భావించారు. ఈ విషయాన్ని BCCI పెద్దలకు చెప్పారు. అనుకున్నదే తడవుగా టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అలా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌కు లలిత్ మోదీ ఫస్ట్ కమిషనర్‌.

Similar News

News November 26, 2024

మొహమాటమే లేదు.. వద్దంటే వద్దంతే!

image

IPL వేలంపాట ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. వరల్డ్ క్లాస్ ఫారిన్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఆటగాళ్లు ఫామ్‌లో లేకున్నా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచి కొనుక్కునేవి. కానీ ఈసారి అలాంటిదేం కనిపించలేదు. విలియమ్సన్, వార్నర్, బెయిర్‌స్టో, స్మిత్, మిచెల్, ఆదిల్ రషీద్, జోసెఫ్, హోల్డర్, నబీ, సౌథీ వంటి టాప్ ప్లేయర్లు ఇటీవల ఫామ్‌లో లేకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

News November 26, 2024

మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు GOOD NEWS

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్‌ను విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు సిలబస్ కోసం <>వెబ్‌సైటును <<>>సంప్రదించాలని సూచించింది. కాగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

News November 26, 2024

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల‌పై సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

image

దేశంలో బ్యాలెట్ ఓటింగ్‌కు ఆదేశాలివ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ‘మీరు గెలిస్తే EVMలు బాగా ప‌నిచేసిన‌ట్టు. ఓడిపోతే ట్యాంప‌ర్ చేసిన‌ట్టా? గ‌తంలో చంద్ర‌బాబు ఓడిపోయిన‌ప్పుడు EVMలను ట్యాంప‌ర్ చేయవచ్చన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ ఓడిపోవ‌డంతో వాటిని ట్యాంప‌ర్ చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌నా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి’ అని వ్యాఖ్యానిస్తూ పిటిష‌న్స్ కొట్టేసింది.