News November 26, 2024
IPL ఎలా, ఎందుకు మొదలైందో తెలుసా?
2007 T20 WCలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రేజ్ చూసి ఇండియాలోనూ T20 టోర్నీ నిర్వహించాలని అప్పటి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ భావించారు. ఈ విషయాన్ని BCCI పెద్దలకు చెప్పారు. అనుకున్నదే తడవుగా టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అలా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌కు లలిత్ మోదీ ఫస్ట్ కమిషనర్.
Similar News
News December 11, 2024
త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
AP: ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు రాష్ట్రంలో ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వగా 12 స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.15లక్షలు కాగా, లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్లకు లైసెన్సులిస్తారు. కనీసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
News December 11, 2024
మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్!
AP: వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి లభించగానే పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.
News December 11, 2024
నాగబాబుకు మంత్రి పదవి.. ఇచ్చేది ఈ శాఖేనా?
AP: మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ఉంది.