News November 26, 2024

కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

విజయ్ ‘జననాయగన్’ వివాదం ఏంటంటే?

image

నిర్మాత సెన్సార్ సర్టిఫికెట్ కోసం DEC 19న CBFCకి సినిమా చూపించారు. కొన్ని కట్స్ చేసుకొని వస్తే U/A సర్టిఫికెట్ ఇస్తామని బోర్డు చెప్పడంతో మార్పులు చేసి 24న మూవీని సబ్మిట్ చేశారు. కానీ బోర్డు నుంచి రెస్పాన్స్ లేదు. మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉందంటూ సినిమాను JAN 5న రివైజింగ్ కమిటీకి పంపారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సర్టిఫికెట్ త్వరగా ఇచ్చేలా ఆదేశించాలని ప్రొడ్యూసర్ <<18789554>>కోర్టును<<>> ఆశ్రయించారు.

News January 8, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.