News November 26, 2024
కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ
TG: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News December 13, 2024
రేపటి నుంచే మూడో టెస్ట్.. షెడ్యూల్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి గబ్బాలో BGT మూడో టెస్ట్ జరగనుంది. 5.50am-7.50am ఫస్ట్ సెషన్, 8.30am-10.30am సెకండ్ సెషన్, 10.50am-12.50 pm థర్డ్ సెషన్ జరుగుతుంది. భారత జట్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, అశ్విన్ ప్లేస్‌లో సుందర్ ఆడే ఛాన్సుంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. అటు AUSలో బొలాండ్ స్థానంలో హెజిల్‌వుడ్ ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు .
News December 13, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ICC ఓకే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌కు ICC ఆమోదం తెలిపినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. BCCI, PCB ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నాయి. IND ఆడే మ్యాచులు దుబాయ్‌లో, ఇండియాVSపాక్ మ్యాచ్ మాత్రం కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం. IND మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయినందుకు PCBకి ఎలాంటి ఆర్థిక పరిహారం ఇవ్వరని, 2027 తర్వాత ICC ఉమెన్స్ టోర్నమెంట్ హోస్టింగ్ హక్కులను మాత్రం ఇస్తారని తెలుస్తోంది.
News December 13, 2024
రాహుల్ గాంధీకి అలహాబాద్ కోర్టు సమన్లు
జోడో యాత్రలో సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సేవలందించారని, పింఛన్ కూడా తీసుకున్నారంటూ రాహుల్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. దీనితో ఏకీభవించిన కోర్టు అభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు జనవరి 10న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.