News November 26, 2024
29న ఛాంపియన్స్ ట్రోఫీపై ఫైనల్ డెసిషన్?
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈ నెల 29న ICC తుది నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్, భారత్ పర్యటన, హైబ్రిడ్ మోడల్ వంటి విషయాలపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సమాచారం. కాగా హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచుతామని ICC ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచులను UAEలో నిర్వహించాలని, ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరపాలని పాక్‌ను కోరినట్లు సమాచారం.
Similar News
News November 27, 2024
నేటి ముఖ్యాంశాలు
* రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: ద్రౌపదీ ముర్ము
* ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు
* IITలతో టాటా ఇన్నోవేషన్ హబ్ లింక్: CBN
* ఉపాధి హామీలో కొత్త పనులు చేర్చండి: పవన్ కళ్యాణ్
* మహిళలను లక్షాధికారులు చేసేందుకు 19 రకాల వ్యాపారాలు: మంత్రి సీతక్క
* రాష్ట్రపతిని రాహుల్ అవమానించారు: బీజేపీ
* అదానీకి రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్: KTR
News November 27, 2024
IPL: మ్యాచ్‌లు ఆడకుంటే డబ్బు ఇస్తారా?
IPL వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. రూ.10కోట్లు పలికిన క్రికెటర్‌కు 3ఏళ్ల కాంట్రాక్టు కింద రూ.30కోట్లు దక్కుతాయి. ఆటగాడు మ్యాచ్‌లు ఆడినా ఆడకున్నా సీజన్ మొత్తం జట్టుకు అందుబాటులో ఉంటే అతడికి మొత్తం డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సీజన్ ప్రారంభానికి ముందే ప్లేయర్ జట్టుకు దూరమైతే డబ్బు చెల్లించరు. కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటే దాన్ని బట్టి చెల్లిస్తారు.
News November 27, 2024
దారుణం: 87మందిపై వైద్యుడి అత్యాచారం
నార్వేకు చెందిన ఆర్నీ బై అనే గైనకాలజిస్ట్ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ దానికి కళంకం తీసుకొచ్చాడు. గడచిన 20 ఏళ్లలో 14 నుంచి 67 ఏళ్ల వయసున్న 87మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ అఘాయిత్యాలను రహస్యంగా సీసీటీవీ కెమెరాలో చిత్రీకరించాడు. ఇద్దరు మైనర్ల ఫిర్యాదుతో అతడి ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, 6వేల గంటల ఫుటేజీని అతడి కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు.