News November 26, 2024
వారి విషయంలో క్రియేటివ్‌గా ఆలోచించండి.. కేంద్రానికి సుప్రీం సూచన
విమానాల్లో అతిగా ప్రవర్తించే ప్రయాణికుల కట్టడికి క్రియేటివ్‌గా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం, విమానయాన శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో ఓ వ్యక్తి మద్యం మత్తులో తనపై యూరినేట్ చేశాడని 73 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను మెరుగుపరిచేలా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Similar News
News November 27, 2024
కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి
TG: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అలాంటి పార్టీని కూకటివేళ్లతో పెకలిస్తామని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వయసుకు మించి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రమే ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండేవని తెలిపారు.
News November 27, 2024
వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు: రామ్మోహన్ నాయుడు
TG: రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో భూసేకరణ పూర్తవ్వగానే వీలైనంత త్వరగా పనులు చేపడుతామని చెప్పారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 27, 2024
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
బరువు తగ్గడం అంత తేలిక కాదు. కానీ సరైన డైట్, జీవనశైలి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్, షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఒకపూట పూర్తిగా ఉడికించిన కూరగాయలు తినాలి. రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. సమృద్ధిగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువసేపు వ్యాయామం చేయాలి. రాత్రి 9 గంటలలోపే నిద్రించాలి.