News November 26, 2024

వారి విషయంలో క్రియేటివ్‌గా ఆలోచించండి.. కేంద్రానికి సుప్రీం సూచ‌న‌

image

విమానాల్లో అతిగా ప్ర‌వ‌ర్తించే ప్ర‌యాణికుల క‌ట్ట‌డికి క్రియేటివ్‌గా ఆలోచించి మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని కేంద్రం, విమాన‌యాన శాఖ‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో ఓ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో త‌న‌పై యూరినేట్ చేశాడ‌ని 73 ఏళ్ల మ‌హిళ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు విచారించింది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ప్ర‌స్తుతం ఉన్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మెరుగుప‌రిచేలా ఆయా శాఖ‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Similar News

News December 13, 2024

డ్రామాలతో కాంగ్రెస్ డైవర్షన్ పాలన: బండి సంజయ్

image

అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్ ఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘ఇలా డ్రామాలు చేసి డైవర్షన్ పాలన సాగిస్తోందీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకప్పుడు తప్పుడు పాలన చేసి రాష్ట్రాన్ని దోచుకున్నవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే, జాతీయ అవార్డు గ్రహీత నటుడిని మాత్రం అరెస్ట్ చేశారు. సెన్సేషనలిజం వారి అసమర్థతను దాచలేదు. కాంగ్రెస్ నాటకాన్ని దేశం మొత్తం చూసింది’ అని ఫైరయ్యారు.

News December 13, 2024

గ్రేట్.. రక్త దానం చేసి 24లక్షల మంది శిశువులకు ప్రాణం!

image

‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’ అని పేరున్న జేమ్స్ హారిసన్ 60 ఏళ్లుగా వారానికోసారి రక్త దానం చేస్తూ ఇప్పటి వరకు 24 లక్షల మంది శిశువులను రక్షించారు. ఈయన రక్తంలో ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉన్నాయి. 14 ఏళ్ల వయస్సులో ఆయన రక్తమార్పిడిలో యాంటీ-డీని గుర్తించారు. ఆయనను ఆస్ట్రేలియాలో నేషనల్ హీరోగా పిలుస్తుంటారు. హారిసన్ దాతృత్వానికి అనేక అవార్డులూ ఆయన్ను వరించాయి.

News December 13, 2024

ఎల్లుండి అల్పపీడనం.. భారీ వర్షాలు

image

ద.అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశముందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఎల్లుండికి అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.