News November 27, 2024
నేషనల్ హైవేపై ఆందోళన విరమించిన రైతులు
TG: నిర్మల్(D) దిలావర్‌పూర్‌లో నేషనల్ హైవేపై స్థానిక రైతులు ఆందోళన విరమించారు. కాగా స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌పై సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లుగా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీవో రత్నకళ్యాణిని చుట్టుముట్టగా ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 27, 2024
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.196 కోట్లు రిలీజ్
TG: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతుల కొరత ఉంది. ఈ విషయమై స్థానిక నాయకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా మౌళిక వసతులు పూర్తి చేయాల్సిన ఇళ్లు ఇంకా 40 వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News November 27, 2024
శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు
TG: ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 27, 2024
మరోసారి కెప్టెన్‌గా ‘కింగ్’?
విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లను వదులుకున్న బెంగళూరు కెప్టెన్సీని కింగ్‌కే ఇవ్వాలని యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్లేయర్లు ఎవరూ కనిపించట్లేదు. కాగా కోహ్లీ నాయకత్వంలో RCB 144 మ్యాచులు ఆడగా 68 విజయాలు, 72 పరాజయాలు పొందగా నాలుగింట్లో ఫలితం తేలలేదు.