News November 27, 2024

మరో వినోద్ కాంబ్లీలా మారిన పృథ్వీషా?

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా మరో వినోద్ కాంబ్లీలా మారిపోయారు. నెక్ట్స్ సచిన్ అని అందరూ అనుకుంటుండగానే పాతాళానికి పడిపోయారు. దేశవాళీ, భారత జట్టులో చోటు కోల్పోవడం, నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుండటంతో ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపలేదు. ఆయనపై కనీసం రూ.75 లక్షలు వెచ్చించేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. క్రమశిక్షణ లేకపోవడంతో అప్పట్లో భారత మాజీ క్రికెటర్ కాంబ్లీకి కూడా ఇదే గతి పట్టింది.

Similar News

News January 14, 2026

‘ట్రంప్ ఎలా బతికున్నారో ఏంటో’.. ఆరోగ్యశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

image

ట్రంప్ జంక్ ఫుడ్ అలవాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మెక్‌డొనాల్డ్స్ ఫుడ్, క్యాండీలు తింటూ డైట్ కోక్ తాగుతారని తెలిపారు. రోజంతా శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ‘ఆయన ఇంకా ఎలా బతికున్నారో అర్థం కావడం లేదు’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ప్రయాణాల్లో కార్పొరేట్ కంపెనీల ఫుడ్‌నే నమ్ముతారని.. ఆయనకు దైవ సమానమైన శరీరతత్వం ఉందని చమత్కరించారు.

News January 14, 2026

పండుగ రోజున స్వీట్స్ ఎందుకు తింటారు?

image

సంక్రాంతి ఆరోగ్యప్రదాయిని. చలికాలంలో వచ్చే వాత సమస్యలను తగ్గించడానికి సకినాల్లో వాడే వాము, శరీరానికి వేడినిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా అందుతాయి. దంపుడు బియ్యంతో చేసే పొంగలి, ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే చెరుకు, పోషకాలున్న గుమ్మడికాయ శరీరానికి బలాన్నిస్తాయి. ఇంటి ముంగిట పేడ నీళ్లు, మామిడాకులు బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.

News January 14, 2026

RFCLలో 36పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (<>RFCL<<>>)లో 36 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 22వరకు పంపవచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, BSc(Eng), MSc(కెమిస్ట్రీ), PG డిప్లొమా(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), MBA, బీఫార్మసీ, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rfcl.co.in