News November 27, 2024
క్విక్ కామర్స్.. కిరాణా షాపులకు దెబ్బేనా?
10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్‌కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.
Similar News
News November 27, 2024
అదానీ షేర్లు అదుర్స్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్స్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు దుమ్మురేపుతున్నాయి. US కోర్టు మోపిన అవినీతి, లంచం అభియోగాల్లో తమ ప్రతినిధుల పేర్లు లేవని చెప్పడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. అదానీ టోటల్ గ్యాస్ 19.9, అదానీ పవర్ 17.1, అదానీ ఎనర్జీ 10, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 9.9, అదానీ గ్రీన్ ఎనర్జీ 9.8, అదానీ విల్మార్ 9, NDTV 7.6, అదానీ పోర్ట్స్ 7.2, అంబుజా 4.7, ఏసీసీ 4, సంఘి 3.7% మేర ఎగిశాయి. ఇక అదానీ నెట్‌వర్త్ $70.8bగా ఉంది.
News November 27, 2024
ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు
TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.
News November 27, 2024
అదానీ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం: పవన్
AP: అదానీ వ్యవహారంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు.