News November 27, 2024
ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు
TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.
Similar News
News November 27, 2024
బాబోయ్..! వరుడికి ఇవేం కండీషన్లు పెళ్లి కూతురా!!
ఓ ఇంగ్లిష్ డైలీలో పబ్లిష్ అయిన ఓ మ్యాట్రిమోని యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘స్త్రీవాద అభిప్రాయాలతో పొట్టి జుట్టు, చెవి పోగులు గల 30+ వయసు గల విద్యావంతురాలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆమెకు 25-28 మధ్య వయస్సులోని అందమైన యువకుడు కావలెను. ఏకైక సంతానమై సొంత వ్యాపారాలు, భారీ బంగ్లా లేదా 20 ఎకరాల భూమి ఉండాలి. వంట తప్పక తెలియాలి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై మీరేమంటారు?
News November 27, 2024
IPL వేలంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ
IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్‌ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
News November 27, 2024
రైతులను దగా చేసి విజయోత్సవాలా?: హరీశ్‌రావు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న <<14718777>>రైతు పండుగ<<>> విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా? వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయనందుకు ఉత్సవాలా? రుణమాఫీ చేస్తానని సగం మందికి మొండిచేయి చూపించారు. ఏడాదిలో రైతులకు రూ.40,800 కోట్లు బాకీ పడ్డారు. ఇవన్నీ చెల్లించి పండుగ చేసుకోవాలి’ అని హితవు పలికారు.