News November 27, 2024

ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు

image

TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.

Similar News

News December 4, 2024

కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు: ఫడణవీస్

image

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతరం సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉంటారు. కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు’ అని తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.

News December 4, 2024

ఉచిత విద్యుత్ నిలిపివేయం: మంత్రి గొట్టిపాటి

image

AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తున్నారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

News December 4, 2024

ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!

image

+94777455913, +37127913091, +56322553736 నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఫోన్ ఎత్తకూడదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి ఇంటర్నేషనల్ కోడ్‌లతో మొదలయ్యే నంబర్లతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే బ్యాంక్ వివరాలు కాపీ చేస్తారని, #90, #09 నంబర్లు నొక్కొద్దని హెచ్చరించారు.