News November 27, 2024
భారత్‌పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం: పవన్ కళ్యాణ్

AP: తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు PM మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్లమెంట్ సెషన్లతో బిజీగా ఉన్నా నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్‌లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థాంక్యూ సర్’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.
News January 19, 2026
పండ్లు Vs పండ్ల రసాలు.. ఏవి బెటర్?

పండ్ల రసం తాగడం కంటే నేరుగా పండ్లను తినడమే చాలా ఉత్తమమని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ‘ఫ్రూట్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కానీ పండ్ల రసంలో పీచుపదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. దీంతో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్, PCOD, ఒబెసిటీ, గుండె వ్యాధులు ఉన్న వారికి జ్యూస్ మంచిది కాదు’ అని చెబుతున్నారు.
News January 19, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.


