News November 27, 2024
భారత్‌పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం: పవన్ కళ్యాణ్
AP: తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు PM మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్లమెంట్ సెషన్లతో బిజీగా ఉన్నా నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్‌లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థాంక్యూ సర్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2024
త్వరలో పుతిన్ భారత్ పర్యటన
వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష ఫారిన్ పాలసీ అడ్వైజర్ యూరీ యుషాకోవ్ తెలిపారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైనప్పుడు పుతిన్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. దీంతో మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇక్కడికి వస్తున్నారు.
News December 3, 2024
గుండు చేయిస్తే జుట్టు మందం అవుతుందా?
తలపై జుట్టు పలుచగా ఉంటే గుండు చేయించుకోవడం వల్ల మందంగా మొలుస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని, గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదని చెబుతున్నారు. గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకానీ తలపై వెంట్రుకలు ఎక్కువవడం సాధ్యం కాదంటున్నారు.
News December 3, 2024
విపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే?
శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయనను ప్రతిపక్షనేతగా నియమించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమలనాథులు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.