News November 27, 2024
పరవాడ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరవాడ ఫార్మా సిటీ కంపెనీలో విషవాయువులు లీకై ఒకరు మరణించారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు.
Similar News
News November 27, 2024
మారిటైమ్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.
News November 27, 2024
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు: మోదీ
TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. TG BJP నేతలతో భేటీ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు BRS దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని, ఇప్పుడు ఎంతో ఆశతో BJP వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో BJP ఉనికి వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, BRSల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా BJP స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.
News November 27, 2024
హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో మూవీ టీమ్‌తో ఆయన షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 28న సినిమా విడుదల కానుంది. ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తుండగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.