News November 27, 2024

పరవాడ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరవాడ ఫార్మా సిటీ కంపెనీలో విషవాయువులు లీకై ఒకరు మరణించారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు.

Similar News

News January 14, 2026

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

image

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. స్టోరీ లైన్ పాతదే అయినా కామెడీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారని ఆడియన్స్ తెలిపారు. పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయని చెప్పారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ & రేటింగ్.

News January 14, 2026

NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

image

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.