News November 27, 2024

మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి?: కిషన్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి? అంటూ ఆయన ప్రశ్నించారు. వరిధాన్యానికి బోనస్ విషయంలోనూ సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని నిబంధనలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News November 27, 2024

ఇసుక లభ్యత పెంచండి: సీఎం చంద్రబాబు

image

APలో ఇసుక లభ్యత, అక్రమాల నియంత్రణపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా లభ్యత పెంచాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి శాండ్ కమిటీలు, అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బంది పెట్టవద్దని, ధరల కట్టడికి పున:సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా, తవ్వకం వ్యయం తక్కువ ఉండేలా చూడాలన్నారు.

News November 27, 2024

సయ్యద్ మోదీ టోర్నీలో రెండో రౌండ్‌కు సింధు, లక్ష్య సేన్

image

ఢిల్లీలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో పీవీ సింధు, లక్ష్య సేన్ రెండో రౌండ్‌కు ముందంజ వేశారు. భారత షట్లర్ అన్మోల్ ఖార్బ్‌పై 21-17, 21-15 తేడాతో సింధు, మలేషియా షట్లర్ షోలెహ్ ఐదిల్‌పై 21-12, 21-12 తేడాతో లక్ష్యసేన్ గెలిచారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న సింధు.. తర్వాతి రౌండ్‌లో మరో భారతీయురాలు ఇరా శర్మను ఎదుర్కోనున్నారు.

News November 27, 2024

గుకేశ్ ఖాతాలో 3వ విజయం

image

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్‌లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.