News November 27, 2024
మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి?: కిషన్‌రెడ్డి
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి? అంటూ ఆయన ప్రశ్నించారు. వరిధాన్యానికి బోనస్ విషయంలోనూ సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని నిబంధనలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News December 14, 2024
గబ్బాలో కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుంది: పాంటింగ్
బ్రిస్బేన్(గబ్బా)లో భారత్, ఆస్ట్రేలియా సమ ఉజ్జీలుగా పోరాడతాయని, చివరికి విజయం మాత్రం కంగారూలనే వరిస్తుందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ‘తొలి రెండు మ్యాచులు చూసిన తర్వాత ఈ సిరీస్‌లో ఫలితం ఎలా ఉండనుందన్నది అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. భారత్ రికార్డు ఇక్కడ బాగుంది. కానీ ఆస్ట్రేలియా 40 ఏళ్లలో 2 సార్లే ఓడింది. కాబట్టి ఆసీస్‌దే తుది విజయం’ అని పేర్కొన్నారు.
News December 14, 2024
వారంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక: సీఎం రేవంత్
TG: ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో గ్లోబల్ మాదిగ డే-2024లో ఆయన పాల్గొన్నారు. ‘వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు రాకుండా వర్గీకరణ చేస్తాం. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ వ్యక్తిని నియమించాం’ అని CM చెప్పారు.
News December 14, 2024
బాంబు బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడు?
దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడితో పాటు తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గతంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకోలేదనే కోపంతోనే ఆ విద్యార్థి ఈ పని చేసినట్లు తెలుస్తోంది.