News November 27, 2024

ఒక్క ఛార్జ్‌తో 102KM: యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది

image

హోండా కంపెనీ భారత మార్కెట్లో Activa e ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 102KM వెళ్లడం దీని ప్రత్యేకత. స్టైలింగ్ విషయంలో కంపెనీ మినిమలిస్టిక్ అప్రోచ్ పాటించింది. ICE స్కూటర్‌ మోడల్‌నే అనుసరించింది. రెండు 1.5kWh బ్యాటరీలుండే ఈ స్కూటర్లో LED హెడ్‌లైట్‌కే ఇండికేటర్లు ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్ చిన్నగా సీటు పెద్దగా ఉంటాయి. ఇందులో స్టాండర్డ్, స్పోర్ట్, ఈకాన్ వేరియెంట్లు ఉన్నాయి.

Similar News

News January 14, 2026

పొంగల్.. టార్గెట్ ఎలక్షన్స్!

image

PM మోదీ ఈసారి తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ ఇంట పొంగల్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం రాజకీయ చర్చకు దారితీసింది. తన స్పీచ్‌లోనూ తమిళ పదాలు మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది TN అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌‌గా బీజేపీ సన్నద్ధమవుతోంది. అధికారం చేజిక్కించుకుంటామని ఇప్పటికే కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో మోదీ తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది.

News January 14, 2026

విజయ్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

image

ఓ వర్గం ఫ్యాన్స్ కావాలనే తమ సినిమాపై విమర్శలు చేస్తున్నారని పరాశక్తి టీమ్ ఆరోపిస్తోంది. ఫేక్ IDల ద్వారా కొంత మంది బురద జల్లుతున్నారని తాజాగా డైరెక్టర్ సుధా కొంగర అన్నారు. తమపై విమర్శలు చేస్తున్నది రాజకీయ వర్గాలు కాదన్నారు. పండుగకు విడుదలకు నోచుకోని మరో సినిమా హీరో ఫ్యాన్సే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఆమె విజయ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది.

News January 14, 2026

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.