News November 28, 2024

బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్‌

image

TG: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా ఇప్పటివరకు స్మిత అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.

Similar News

News January 14, 2026

దూడల్లో నట్టల బెడద – ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.

News January 14, 2026

పండుగల్లో ఇలా రెడీ..

image

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.

News January 14, 2026

సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

image

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.