News November 28, 2024

బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్‌

image

TG: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా ఇప్పటివరకు స్మిత అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.

Similar News

News November 12, 2025

TODAY HEADLINES

image

➤ జూబ్లీహిల్స్(50.16%), బిహార్‌(66.91%)లో ముగిసిన పోలింగ్
➤ బిహార్‌లో NDA, జూబ్లీహిల్స్‌లో INC గెలుపు: ఎగ్జిట్ పోల్స్
➤ YCP పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: CM CBN
➤ అందెశ్రీ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన CM రేవంత్
➤ ఢిల్లీ పేలుడు సూత్రధారులు, పాత్రధారులను వదలబోమని PM మోదీ హెచ్చరిక
➤ ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
➤ పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి, భారత్‌పై పాక్ PM ఆరోపణలు

News November 12, 2025

ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

image

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్‌(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?

News November 12, 2025

ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

AP: టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండి(NOV 13) నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో టెన్త్ ఫెయిలైన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. లేట్ ఫీ రూ.50తో డిసెంబర్ 3 వరకు, రూ.200తో డిసెంబర్ 10 వరకు, రూ.500తో డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. స్కూల్ హెడ్ మాస్టర్లు https://bse.ap.gov.in/లో స్కూల్ లాగిన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.