News November 28, 2024
బ్లాక్మెయిల్ చేసే వారికి భయపడొద్దు: TG పోలీస్

ప్రేమ, పెళ్లి పేరుతో బ్లాక్మెయిల్ చేసే వారికి భయపడొద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో బెదిరించే వారిపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా యువతులకు అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని, వారి వివరాలు ఎక్కడా బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపారు. 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 17, 2025
GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.