News November 28, 2024
లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్

AP: విజయవాడ గన్నవరం రోడ్డులో నిలిపిఉన్న లారీ క్యాబిన్లో డ్రైవర్ కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలాసేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్లో చూడగా డ్రైవర్ విలవిల్లాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGHకు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Similar News
News January 13, 2026
ఫ్రెషర్లకు ₹18-22 లక్షల ప్యాకేజీ

HCLTech ఫ్రెషర్ల వేతనాల్లో భారీ పెంపును ప్రకటించింది. AI, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలున్న ఇంజినీర్లను ‘ఎలైట్ క్యాడర్’గా పరిగణిస్తూ వారికి ఏడాదికి ₹18-22 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సాధారణ ఫ్రెషర్ల వేతనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ. HCLTech మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ కూడా నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ₹21 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఏడాది HCLTech ఇప్పటికే 10,032 మంది ఫ్రెషర్లను తీసుకుంది.
News January 13, 2026
అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్లు, సిట్ల ఏర్పాటు: కేటీఆర్

TG: పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ ప్రభుత్వం విచారణల పేరిట కమిషన్లు, సిట్ ఏర్పాటు చేస్తోందని KTR విమర్శించారు. ‘మంత్రి PA, రేవంత్ సహచరుడు బెదిరింపులపై సిట్ ఉండదు. ములుగులో మంత్రి PA ఇసుకదందా, బెడ్స్ కొనుగోలులో కుంభకోణం, భూముల అక్రమ అమ్మకాలు వంటివాటిపై సిట్ ఉండదు’ అని ఆయన ఫైరయ్యారు. మంత్రిని ఉటంకిస్తూ కథనం వేస్తే ఛానళ్లపై కేసులు పెట్టి, సిట్ అంటూ డ్రామాలు చేస్తారని దుయ్యబట్టారు.
News January 13, 2026
తప్పుడు నివేదికలతో CBN కేసుల మూసివేత సిగ్గుచేటు: సతీశ్

AP: నిస్సిగ్గుగా తనపై నమోదైన కేసులను CBN ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని YCP దుయ్యబట్టింది. ‘స్కామ్‌తో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ₹370 CR డొల్ల కంపెనీలకు వెళ్లాయని విచారణలో తేలింది. ఆధారాలు ఉండడంతో CBN జైలుకూ వెళ్లారు. ఇపుడు అధికార దుర్వినియోగంతో కోర్టుకు తప్పుడు నివేదిక ఇప్పించి కేసు మూసి వేయించడం సిగ్గుచేటు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.


