News November 28, 2024

లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్

image

AP: విజయవాడ గన్నవరం రోడ్డులో నిలిపిఉన్న లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలాసేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్‌లో చూడగా డ్రైవర్ విలవిల్లాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGHకు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Similar News

News December 10, 2024

ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల

image

AP: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని YCP స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజల గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. సమస్యలపై సర్కార్ దిగొచ్చేవరకూ బాధితులకు అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి’ అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

News December 10, 2024

నేను ఏ పార్టీ మారలేదు: ఆర్.కృష్ణయ్య

image

AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పనిచేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News December 10, 2024

ఒక్క టూర్‌తో రూ.16వేల కోట్లు సంపాదించిన సింగర్!

image

అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ‘ది ఎరాస్ టూర్’ ముగిసింది. 21 నెలల పాటు ఐదు ఖండాల్లో 149 ప్రదర్శనలు నిర్వహించగా వీటిల్లో 10 మిలియన్ల మంది పాల్గొన్నారు. మొన్న బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో జరిగిన ప్రదర్శనతో ఈ టూర్ పూర్తయింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ టూర్ ద్వారా ఆమె $2 బిలియన్లను (రూ.16వేల కోట్లు) వసూలు చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఆమె బిలియనీర్ హోదాను పొందారు.