News November 28, 2024
KTRకు సీతక్క సవాల్
TG: దిలావర్‌పూర్‌లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి KTR పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. KTRకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని సవాల్ విసిరారు.
Similar News
News November 28, 2024
HIGH ALERT.. అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నవంబర్ 30న తుఫాన్ తీరం దాటనుంది.
News November 28, 2024
ఈగల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
AP: డ్రగ్స్ నియంత్రణకు <<14724446>>ఈగల్‌ను <<>>ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.
News November 28, 2024
పుష్ప-2కు సెన్సార్ బోర్డ్ ఏం కట్స్ చెప్పిందంటే..
పుష్ప-2 సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు, ఒకచోట వేంకటేశ్వర్ అన్న పదం తొలగించి భగవంతుడు అన్న పదాన్ని చేర్చినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. వచ్చే నెల 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.