News November 28, 2024
KTRకు సీతక్క సవాల్
TG: దిలావర్‌పూర్‌లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి KTR పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. KTRకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని సవాల్ విసిరారు.
Similar News
News December 9, 2024
ఆయన కంటే మహానటుడు ఎవరున్నారు?: మంత్రి సత్యప్రసాద్
AP: జగన్ కంటే మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అరాచక పాలన సాగించి ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలు చెప్పి హామీలు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. విద్యావ్యవస్థను దారిలో పెట్టి ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
News December 9, 2024
‘పుష్ప-2’: నాలుగు రోజుల్లో భారీగా కలెక్షన్లు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో అత్యంత వేగంగా రూ.800 కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కాగా ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కాస్త తగ్గించారు.
News December 9, 2024
ఆశా వర్కర్లపై పురుష పోలీసులతో దౌర్జన్యమా?: కేటీఆర్
TG: ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మాతృమూర్తులపై పురుష పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని వారిని రోడ్డుపైకి లాగారని మండిపడ్డారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఆగ్రహజ్వాలలను తట్టుకోలేరని హెచ్చరించారు.