News November 29, 2024

శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?

image

కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

Similar News

News March 18, 2026

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు

image

తెలంగాణలో మంగళవారం (మార్చి 17న) రికార్డు స్థాయిలో 2,35,678 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇది సాధారణ సగటు సరఫరా (2.15 లక్షలు) కంటే ఎక్కువ. భారత్ పెట్రోలియం 57,635 (+22.63%), HP 84,156 (+11.98%), ఇండేన్ 93,887 (+1.00%) వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మి ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.

News March 18, 2026

ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

image

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.

News March 18, 2026

కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

image

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్‌ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.