News November 29, 2024

శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?

image

కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

Similar News

News January 25, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.

News January 25, 2026

ఈరోజు మాంసాహారం తింటున్నారా?

image

నేడు సూర్యుడి జన్మదినం. ఈ రథసప్తమి ఆయనకు ప్రీతికరమైన ఆదివారంతో కలిసి వచ్చింది. అందుకే కొన్ని నియమాలు తప్పక పాటించాలంటున్నారు పండితులు. నేడు మాంసం తినడం, మద్యం తీసుకోవడం, జుట్టు/గోర్లు కత్తిరించుకోవడం అశుభమని హెచ్చరిస్తున్నారు. సూర్యుడిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారని చెబుతున్నారు. ఆదివారం నాడు నాన్‌వెజ్ ఎందుకు తినకూడదో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News January 25, 2026

ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

image

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.