News November 29, 2024

ధనుష్ పెట్టిన కేసుపై నయనతార లాయర్ స్పందన ఇదే

image

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ వాడుకున్నారంటూ ధనుష్ వేసిన <<14722518>>సివిల్ కేసుపై<<>> నయనతార తరఫు లాయర్ స్పందించారు. ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘నయనతార-విఘ్నేశ్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న Lex Chambers పర్సనల్ లైబ్రరీ నుంచి ఆ క్లిప్ తీసుకున్నాం. అది సినిమాలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ కేసుపై DEC 2న విచారణ జరిగే అవకాశం ఉంది.

Similar News

News March 3, 2026

ఇండియాను విడిచి వెళ్తా: ఇరానియన్ నటి

image

భద్రతా కారణాల వల్ల తాను ఇండియాను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు ఇరానియన్ మోడల్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మందన కరిమి వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు బయటపెడతానన్నారు. ‘ఇరాన్‌లో నియంతృత్వంపై మాట్లాడటం. వాస్తవాలు చెప్పడం వల్ల చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నాకు ప్రభుత్వం/మీడియా నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు అనిపించడం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 3, 2026

ఒకప్పుడు బంగారాన్ని ఇలా కొలిచేవారు!

image

పూర్వం బంగారాన్ని వీసం, తులం, కాసు, సవర వంటి విధానాల్లో కొలిచేవారు. అప్పట్లో వీసం (19 మి.గ్రా) కనిష్ఠ కొలతగా ఉండేది. 5 వీసాలు = ఒక గురివింద గింజ (95mg). 2 గురివింద గింజలు= 1 కాణి (185mg). 2 కాణిలు= 1 అర్ధణా (365mg). 2 అర్ధణాలు =1 అణా(730mg). 2 అణాలు= 1 బేడ(1.46G). 2 బేడలు= 1 పావు(2.9G). 4 బేడాలు = అరతులం(5.84గ్రా). 2 అరతులాలు= తులం (11.66గ్రాములు). అలాగే సవర/ కాసు అంటే 8గ్రాముల బంగారం అని అర్థం.

News March 3, 2026

డిమాండ్ ఉన్న పంట‌లు సాగు చేసేలా ప్రోత్సహించాలి: సీఎం

image

TG: యూరియా యాప్‌లో కొంత గంద‌ర‌గోళం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని సీఎం రేవంత్ కలెక్టర్ల సమావేశంలో అన్నారు. దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలని, నానో యూరియా ఉప‌యోగాలను క్షేత్ర‌స్థాయిలో చూపించాలని సూచించారు. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుంది అనే విష‌యం రైతుల‌కు తెలియ‌జేయాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట‌లు సాగు చేసేలా అన్న‌దాత‌ల‌ను ప్రోత్స‌హించాలని పేర్కొన్నారు.