News November 29, 2024

ధనుష్ పెట్టిన కేసుపై నయనతార లాయర్ స్పందన ఇదే

image

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ వాడుకున్నారంటూ ధనుష్ వేసిన <<14722518>>సివిల్ కేసుపై<<>> నయనతార తరఫు లాయర్ స్పందించారు. ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘నయనతార-విఘ్నేశ్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న Lex Chambers పర్సనల్ లైబ్రరీ నుంచి ఆ క్లిప్ తీసుకున్నాం. అది సినిమాలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ కేసుపై DEC 2న విచారణ జరిగే అవకాశం ఉంది.

Similar News

News December 9, 2024

కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి

image

సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.

News December 9, 2024

చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

image

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మన్ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొంది.

News December 9, 2024

మంచు మనోజ్ కడుపు, వెన్నెముకకు గాయాలు

image

మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.