News November 29, 2024
రాజ్యసభ సీటు వార్తలపై నాగబాబు ఏమన్నారంటే?

AP: తనకు రాజ్యసభ సీటుపై Dy.cm పవన్ ఢిల్లీ పర్యటనలో <<14729358>>చర్చించారన్న<<>> వార్తలపై నాగబాబు స్పందించారు. ‘అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 5, 2026
ఈ ఏడాదిలోనే స్థానిక ఎన్నికలు: CM CBN

AP: స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలక్షన్లలో ఏకపక్ష విజయాలు సాధించేలా నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని నిన్న అనంతపురం ప్రజాప్రతినిధుల భేటీలో దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌తో పంచాయతీల పదవీకాలం పూర్తవుతుందని, తర్వాత కొన్ని నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు.
News March 5, 2026
భావిభారత పౌరులు.. ఊబకాయులు!

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.
News March 5, 2026
సెమీస్‌లో టీమ్‌గా రాణిస్తారా?

T20WC: ఈరోజు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.


