News November 29, 2024

రాజ్యసభ సీటు వార్తలపై నాగబాబు ఏమన్నారంటే?

image

AP: తనకు రాజ్యసభ సీటుపై Dy.cm పవన్ ఢిల్లీ పర్యటనలో <<14729358>>చర్చించారన్న<<>> వార్తలపై నాగబాబు స్పందించారు. ‘అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

News July 9, 2025

APలో భారీ పెట్టుబడి: TDP

image

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.

News July 9, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

image

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.