News November 29, 2024
RGV ఇంటర్వ్యూలపై పోలీసుల సీరియస్!

RGV కోసం పోలీసులు గాలిస్తుంటే, ఆయన మాత్రం పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి RGV కోసం వచ్చిన పోలీసులు 5రోజులుగా HYDలోనే మకాం వేశారు. ఇప్పటికే RGV హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలు, విశాఖ, గుంటూరులో వేర్వేరుగా RGVపై కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 5, 2026
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <
News March 5, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in
News March 5, 2026
ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.


