News November 29, 2024

RGV ఇంటర్వ్యూలపై పోలీసుల సీరియస్!

image

RGV కోసం పోలీసులు గాలిస్తుంటే, ఆయన మాత్రం పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి RGV కోసం వచ్చిన పోలీసులు 5రోజులుగా HYDలోనే మకాం వేశారు. ఇప్పటికే RGV హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలు, విశాఖ, గుంటూరులో వేర్వేరుగా RGVపై కేసులు నమోదయ్యాయి.

Similar News

News January 22, 2026

సరస్వతీ దేవి అనుగ్రహం కోసం రేపేం చేయాలంటే

image

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పసుపు దుస్తులు ధరించాలి. పూజలో తెల్లని పూలు, గంధం సమర్పించి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, కేసరి, పులిహోరను సమర్పించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజా సమయంలో పుస్తకాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రార్థించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పురాణ వచనం.

News January 22, 2026

పాజిటివ్‌ థింకింగ్‌ ఎలా ప్రాక్టీస్‌ చేయాలంటే?

image

ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని పెంచాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఏ చిన్న విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.

News January 22, 2026

AIIMS కల్యాణి 47 పోస్టులకు నోటిఫికేషన్

image

<>AIIMS<<>> కల్యాణి 47 కాంట్రాక్ట్ జూనియర్ రెసిడెంట్స్(నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS అర్హతగల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in