News November 29, 2024

జగన్.. బైబిల్‌పై ప్రమాణం చేయండి: షర్మిల

image

అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని YS షర్మిల అన్నారు. ‘2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంది. గుజరాత్ ₹1.99కే కొంటే మీరు 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49కు కొన్నారు. ఇందుకోసం మీకు శాలువాలు కప్పి సన్మానాలు చేయాలా? మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్‌ను స్వీకరించాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 26, 2024

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో అంతరాయం!

image

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ డేటా & బ్రాడ్‌బ్యాండ్ సేవలు రెండింటిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వెబ్‌సైట్ స్టేటస్ ట్రాకింగ్ టూల్ Downdetector.com ప్రకారం దాదాపు 46% మంది మొత్తం బ్లాక్‌అవుట్‌ను ఎదుర్కొంటున్నారు. 32% మందికి సిగ్నల్ లేదు & 22% మందికి మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?

News December 26, 2024

సీఎంతో భేటీపై నిర్మాణ సంస్థ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్‌పై నిర్మాణ సంస్థ SVC ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ప్రభుత్వం & టాలీవుడ్ ప్రతినిధుల మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ దూరదృష్టి గల నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. షూటింగ్‌లకు HYDని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు DY.CM భట్టి, మంత్రి కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారు. టాలీవుడ్ TG ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో పాల్గొంటుంది’ అని తెలిపింది.

News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.