News November 29, 2024
క్రికెటర్లపై ఇంగ్లండ్ ఆంక్షలు.. పాక్‌కు షాక్

PSL, SPL వంటి టీ20 లీగులకు ECB షాకిచ్చింది. దేశవాళీ సీజన్ కొనసాగుతున్నప్పుడు లీగ్ క్రికెట్ ఆడకుండా క్రికెటర్లపై ఆంక్షలు విధించింది. IPLకు మాత్రం OK చెప్పింది. వైట్‌బాల్ కాంట్రాక్టు మాత్రమే ఉంటే పర్మిషన్ ఇవ్వొచ్చని, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టు ఉంటే ఇవ్వొద్దని కౌంటీలకు తెలిపింది. అంటే టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నీలప్పుడు క్రికెటర్లు ఇతర లీగుల్లో ఆడలేరు. దీంతో వారి ఆదాయానికి గండి పడనుంది.
Similar News
News March 6, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 6)

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం
News March 6, 2026
‘ఆశా’లకు కొత్త ఫోన్లు, 2 చీరలు: సత్యకుమార్

AP: ఆశావర్కర్లకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాలకు ₹15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1,363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.
News March 6, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


