News November 29, 2024
క్రికెటర్లపై ఇంగ్లండ్ ఆంక్షలు.. పాక్‌కు షాక్
PSL, SPL వంటి టీ20 లీగులకు ECB షాకిచ్చింది. దేశవాళీ సీజన్ కొనసాగుతున్నప్పుడు లీగ్ క్రికెట్ ఆడకుండా క్రికెటర్లపై ఆంక్షలు విధించింది. IPLకు మాత్రం OK చెప్పింది. వైట్‌బాల్ కాంట్రాక్టు మాత్రమే ఉంటే పర్మిషన్ ఇవ్వొచ్చని, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టు ఉంటే ఇవ్వొద్దని కౌంటీలకు తెలిపింది. అంటే టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నీలప్పుడు క్రికెటర్లు ఇతర లీగుల్లో ఆడలేరు. దీంతో వారి ఆదాయానికి గండి పడనుంది.
Similar News
News December 5, 2024
BP, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పప్పు ఇది
పెసరపప్పుతో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువేనని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించి BPని నియంత్రిస్తాయి. ఫైబర్ వల్ల ఆకలి వేయదు. పరోక్షంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది. 130gr పెసలు తీసుకుంటే 5% LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఓ స్టడీ పేర్కొంది. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. విటమిన్స్, మినరల్స్, సూక్ష్మ పోషకాలతో ఇమ్యూనిటీ బలపడుతుంది.
News December 5, 2024
విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్మురేపారు. మేఘాలయతో జరిగిన టీ20లో కేవలం 29 బంతుల్లోనే 106* రన్స్ చేశారు. 28 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. శర్మ ఇన్నింగ్సులో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో భారత బ్యాటర్లకు ఇదే జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఈ ఏడాది NOVలో 28 బంతుల్లో సెంచరీ చేశారు.
News December 5, 2024
ఖజానాను ఖాళీ చేసిన జగన్: యనమల
AP: ప్రజా సమస్యలపై మాజీ సీఎం జగన్ <<14789250>>ఆందోళనలకు<<>> పిలుపునివ్వడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ ప్రస్తుతం అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.