News November 29, 2024
రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు: తుమ్మల
TG: రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు రూ.15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ సైతం ఇదే <<14740821>>అభిప్రాయం<<>> వ్యక్తం చేశారు.
Similar News
News November 29, 2024
రైతులకు ఏడాదిలో ₹54,280 కోట్ల ప్రయోజనం: పొంగులేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఏడాది కాలంలోనే అన్నదాతలకు ₹54,280కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. 22లక్షలకుపైగా రైతులకు ₹17,870Cr రుణమాఫీ, పంటల బీమాకు ₹1,300Cr, ధాన్యం కొనుగోళ్లకు ₹5,040Cr, ఉచిత్ విద్యుత్‌కు ₹10,444Cr, రైతు భరోసాకు ₹7,625Cr, బీమా ప్రీమియానికి ₹1,455Cr, గత యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ₹10,547Cr వెచ్చించినట్లు తెలిపారు.
News November 29, 2024
జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమే: MLC కవిత
TG: జైలుకు వెళ్లొచ్చిన వారు CM అవుతారనుకుంటే KTRకు ఆ ఛాన్స్ లేదని, ఎందుకంటే కవిత ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చారని CM రేవంత్ వ్యాఖ్యలపై MLC కవిత స్పందించారు. సెన్సేషన్ కోసమే రేవంత్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో జైలు జీవితం కేవలం చిన్న గ్యాప్ మాత్రమేనన్నారు. లగచర్ల భూసేకరణ రద్దు BRS విజయమన్న కవిత.. హాస్టల్స్‌లో అమ్మాయిలు చనిపోతే ప్రభుత్వం విఫలమైనట్లు కాదా? అని ప్రశ్నించారు.
News November 29, 2024
వారి రక్షణ బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత: జైశంకర్
బంగ్లాలోని హిందువులు, మైనారిటీల రక్షణ అక్కడి ప్రభుత్వ బాధ్యతని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వీరిపై జరుగుతున్న దాడుల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వం ముందు వ్యక్తం చేసినట్టు తెలిపారు. బంగ్లాలో పరిస్థితులను హైకమిషన్ సమీక్షిస్తోందని పేర్కొన్నారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.