News November 29, 2024

రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు: తుమ్మల

image

TG: రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు రూ.15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ సైతం ఇదే <<14740821>>అభిప్రాయం<<>> వ్యక్తం చేశారు.

Similar News

News January 16, 2026

ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

image

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

News January 16, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) 62 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా అప్రెంటిస్‌లు JAN 28న, డిగ్రీ (BCom,BSc/BCA)ఉత్తీర్ణులు JAN 29న, బీఈ/బీటెక్ అర్హతగల వారు JAN 30న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News January 16, 2026

కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

image

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.