News November 29, 2024
రిషితేశ్వరి కేసు కొట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.
Similar News
News November 29, 2024
ఇలాంటి జాబ్ మీరూ చేస్తారా?
ఉద్యోగాలంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఒకరి కింద తక్కువ జీతానికి పనిచేయాలి కాబట్టి. కానీ, ఏడాదికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తూ రూ.లక్షల్లో జీతం పొందే ఉద్యోగం గురించి మీకు తెలుసా? సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బల్బును ఒక్కసారి మార్చినందుకు ఆ ఉద్యోగికి 20,000 డాలర్లు (రూ.16.5 లక్షలు) చెల్లిస్తారు. 1500 ఫీట్ల ఎత్తులో ఉన్న టవర్‌పైకి ఎక్కి దానిపైన ఉన్న బల్బును మార్చితే చాలు.
News November 29, 2024
20 ఏళ్లుగా ముక్కులో ఉండిపోయిన పాచిక!
చైనాకు చెందిన షావోమా(23) అనే వ్యక్తి చాలాకాలంగా తుమ్ములు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయగా ముక్కులో 2 సెం.మీ సైజున్న ఓ పాచిక(డైస్)ను గుర్తించారు. తనకు మూడేళ్లున్నప్పుడు అది ముక్కులోకి వెళ్లి ఉండొచ్చని షావోమా తెలిపారు. దాని చుట్టూ కండ కూడా పెరిగిపోవడంతో వైద్యులు జాగ్రత్తగా తొలగించారు. ఇన్నేళ్లుగా ముక్కులో పాచికతో సమస్యల్లేకపోవడం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News November 29, 2024
పృథ్వీషా అంత డబ్బును హ్యాండిల్ చేయలేకపోయాడు: మాజీ కోచ్
డబ్బు, కీర్తిని పృథ్వీ షా హ్యాండిల్ చేయలేకపోయారని ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కోచ్ ప్రవీణ్ ఆమ్రే అభిప్రాయపడ్డారు. ‘నైపుణ్యం కలిగిన ఆటగాడు ఇలా వృథా కావడం బాధాకరం. డీసీ పుణ్యమా అని 23 ఏళ్లకే రూ.30-40 కోట్లు సంపాదించుకున్నాడు. కాంబ్లీ ఎలా దిగజారాడో మూడేళ్ల క్రితమే పృథ్వీకి వివరించాను. కానీ చిన్నవయసులో అంత డబ్బు చూశాక షాకి ఆట మీద ఫోకస్ తగ్గింది. IPLలో అన్‌సోల్డ్ కావడం అతడి మంచికే’ అని వ్యాఖ్యానించారు.