News November 29, 2024

రిషితేశ్వరి కేసు కొట్టివేత

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్‌ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.

Similar News

News December 3, 2024

రాష్ట్రంలో 7న ఆటోల బంద్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బంద్‌తో పాటు ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు AITUC నేతలు తెలిపారు. నిన్న హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ‘బంద్’ గోడపత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

News December 3, 2024

మార్చి 15 నుంచి ‘టెన్త్’ పరీక్షలు?

image

AP: వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్‌లో రూపొందించారు. సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించారు.

News December 3, 2024

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

image

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈ నెల 22న వీరి వివాహం ఉదయ్‌పుర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారు. కాగా వరుడు సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. త్వరలో వీరి వివాహ పనులు ప్రారంభమవుతాయి.