News November 29, 2024

SMATలో ఝార్ఖండ్ సంచలనం

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(SMAT)లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ విధ్వంసం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ 20 ఓవర్లకు 93 పరుగులు చేయగా 4.3 ఓవర్లలోనే ఝార్ఖండ్ 94 రన్స్‌ను ఛేజ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే 77 పరుగులు చేయడం విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టుకు ఆడనున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 27, 2026

కళ్ల కింద ముడతలు తగ్గాలంటే?

image

అందంగా కనిపించాలంటే మేకప్ వేస్తే సరిపోదు ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కళ్ల కింద ముడతలు వ‌ృద్ధాప్య ఛాయలకు సంకేతాలు. వీటిని తగ్గించాలంటే రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటికొలను దగ్గర పెట్టి….చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి.

News January 27, 2026

భానుచందర్ ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

సీనియర్ నటుడు భానుచందర్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చింది. తాను తీస్తోన్న సినిమాలో నటించేందుకు భానుచందర్ ఓకే చెప్పారంటూ ఓ యువ డైరెక్టర్ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందులో తెల్లటి గడ్డంతో స్లిమ్‌గా అయిపోయిన భానుచందర్‌ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిరీక్షణ సినిమాతో సినీ ప్రేమికులకు దగ్గరైన ఆయనను చాలా కాలం తర్వాత చూసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 73ఏళ్లు.

News January 27, 2026

వరల్డ్‌కప్‌లోకి ఇలా రావాలనుకోలేదు: స్కాట్లాండ్

image

T20 WC నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌కు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్‌బ్లేడ్ స్పందించారు. ‘ప్రపంచకప్‌కు ఇలా వెళ్లాలని కోరుకోలేదు. అర్హత సాధించేందుకు ఓ ప్రక్రియ ఉంది. ఇలాంటి ఆహ్వానాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ ప్రత్యేక పరిస్థితుల మధ్య మేం టోర్నీలో అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది. బంగ్లాకు సానుభూతి తెలుపుతున్నాం’ అని అన్నారు.