News November 29, 2024
SMATలో ఝార్ఖండ్ సంచలనం

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(SMAT)లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ విధ్వంసం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ 20 ఓవర్లకు 93 పరుగులు చేయగా 4.3 ఓవర్లలోనే ఝార్ఖండ్ 94 రన్స్‌ను ఛేజ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే 77 పరుగులు చేయడం విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టుకు ఆడనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 16, 2025
15 బంతుల్లో హాఫ్ సెంచరీ..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ మరోసారి చెలరేగారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 22 బంతుల్లో 73 రన్స్ బాదారు. ఇందులో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తొలుత రాజస్థాన్ 216/4 స్కోర్ చేయగా, ముంబై 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో బ్యాటర్ రహానే 41 బంతుల్లో 72* రన్స్ చేశారు.
News December 16, 2025
మెస్సీ టూర్‌లో ‘బెస్ట్ సెల్ఫీ’.. నెట్టింట ప్రశంసలు!

GOAT టూర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫొటో దిగేందుకు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ స్పెషల్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యటనలో తమకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, సువారెజ్ స్వయంగా కారులో సెల్ఫీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్స్ అందరూ నవ్వుతూ ఇచ్చిన ఈ ఫోటోను ‘బెస్ట్ సెల్ఫీ’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. వారి నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.
News December 16, 2025
‘పోలవరం-నల్లమలసాగర్’పై SCలో TG పిటిషన్

AP చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై TG ప్రభుత్వం SCలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని నిలువరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. గోదావరి నీటి తరలింపుతో TGకి నష్టం వాటిల్లుతుందని తెలిపింది. కాగా ఈ ప్రాజెక్టుపై AP ఇప్పటికే SCలో కేవియెట్ పిటిషన్ వేసింది. గతంలో ‘పోలవరం-బనకచర్ల’ DPRను TG అభ్యంతరంతో కేంద్రం వెనక్కు పంపింది. తాజాగా దానిని కొంత సవరించి తాజా లింకు ప్రాజెక్టుకు AP నిర్ణయించింది.


