News November 30, 2024
టాలెంట్ ఉంటే సరిపోదా?
IPL వేలం క్రికెట్ ప్రేమికుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. ప్రపంచ దేశాల్లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వార్నర్, విలియమ్సన్, చిన్న దేశం బంగ్లా నుంచి వచ్చినా అగ్రశ్రేణి దేశాలను వణికించిన ముస్తఫిజుర్ రెహ్మాన్ ఈ IPL వేలంలో అమ్ముడుపోలేదు. అయితే అంతటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను కొనని ఫ్రాంచైజీలు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?
Similar News
News November 30, 2024
GHMC మినహా అన్ని జిల్లాల్లో 99శాతం సర్వే పూర్తి
TG: జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 99శాతం కుల గణన సర్వే పూర్తి అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయినట్లు పేర్కొంది. 49,79,473 ఇళ్లకు కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. అత్యధికంగా ములుగు 92శాతం డేటాను కంప్యూటీకరించారు. మరోవైపు GHMCలో 82.4 శాతం సర్వే పూర్తయింది.
News November 30, 2024
నేడు ‘రైతు పండుగ’ సభకు సీఎం
TG: పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సభలో సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే విషయాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
News November 30, 2024
రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు: కిషన్ రెడ్డి
TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్‌సీఐ స్కీమ్‌తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.