News November 30, 2024
టాలెంట్ ఉంటే సరిపోదా?

IPL వేలం క్రికెట్ ప్రేమికుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. ప్రపంచ దేశాల్లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వార్నర్, విలియమ్సన్, చిన్న దేశం బంగ్లా నుంచి వచ్చినా అగ్రశ్రేణి దేశాలను వణికించిన ముస్తఫిజుర్ రెహ్మాన్ ఈ IPL వేలంలో అమ్ముడుపోలేదు. అయితే అంతటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను కొనని ఫ్రాంచైజీలు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?
Similar News
News July 8, 2025
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్

APలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. బెంగళూరులో GCC గ్లోబల్‌లీడర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AI, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ‘USA సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. టెక్నాలజీలో క్వాంటమ్ వ్యాలీ గేమ్‌ఛేంజర్‌గా నిలవనుంది. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఇస్తున్నాం’ అని తెలిపారు.
News July 8, 2025
సోషల్ మీడియా స్నేహితులను నమ్ముతున్నారా?

TG: సోషల్ మీడియాలో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. అందమైన ప్రొఫైల్స్ చూసి, వారిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని Xలో తెలిపారు. గోల్డ్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో రూ.లక్షలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మోసపోతారన్నారు. పెట్టుబడి అనేది కీలకమని, అపరిచితుల్ని నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు.
News July 8, 2025
మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా RCB

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా అవతరించింది. ఈ ఏడాది 12.2 శాతం విలువ పెరిగి $269 మిలియన్లతో అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. $249 మిలియన్లతో MI రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత $235 మిలియన్లతో CSK మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యు రూ.1.58 లక్షల కోట్లుగా ఉంది.